Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరో ఆడియో వేడుక అయినా, ఏ ఇతర సినిమా వేడుక అయినా కూడా ఎక్కువ కనిపించే యాంకర్ సుమ. ఆమె కాదంటే జాన్సి, శిల్ప, ఉదయభాను, అశ్వినీలను మనం చూడవచ్చు. అయితే ‘ఒక్క క్షణం’ ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం హరితేజ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. హరితేజ బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లి తెర మీద వెండి తెరమీద చాలా బీజీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక క్షణం చిత్రం కోసం ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ సమయంలోనే తనకు అల్లు అర్జున్ అంటే చాలా అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్‌లోని అన్ని యాంగిల్స్ తనకు నచ్చుతాయంటూ చెప్పడం జరిగింది.
ఇక అల్లు అర్జున్ మాట్లాడిన సమయంలో చిత్రం గురించి మాట్లాడిన తర్వాత చివర్లో హోస్టింగ్ చేసిన హరితేజ గురించి కూడా మాట్లాడాడు. యాంకర్‌గా హరితేజ బాగా చేసిందని, కార్యక్రమంను చక్కగా నడిపించడంలో ఆమె తోడ్పాటు అమోఘం అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇష్టమైన యాక్టరస్‌లో ఇష్టమైన వారు హరితేజ అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో తాను ఎప్పుడు చెప్పలేదని, ఇప్పుడు సందర్బం వచ్చింది కనుక చెప్పాను అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఇక ఆమెకు తాను ఇష్టం అని చెప్పడం సంతోషంగా ఉందని, అయితే వేరే హీరో సినీ వేడుకకు వెళ్లినప్పుడు ఆ హీరో అభిమానం అంటూ చెప్తుందేమో చూడాలని నవ్వుకుంటూ అన్నాడు. వేరే హీరో ఇష్టం అని చెప్పాలి.. అంటూ హరితేజకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలోనే ఎనీ సెంటర్ అల్లు అర్జున్ అభిమాన హీరో అంటూ సమాధానం చెప్పింది. దాంతో అంతా కూడా నవ్వుకున్నారు.