తన చిన్నారి కూతురు అర్హ చేసే అల్లరి అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు చాలా ఇష్టం. అర్హతో కొద్దిసేపు ఆడుకుంటే తన ఒత్తిడినంతా మర్చిపోతాడు. లాక్డౌన్ సమయంలో పిల్లలతోనే గడిపిన బన్నీ.. ప్రస్తుతం `పుష్ప` సినిమా షూటింగ్ కోసం బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది.
లాంగ్ షెడ్యూల్ కావడంతో అర్హను బన్నీ చాలా మిస్ అవుతున్నాడట. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా బన్నీ వెల్లడించాడు. అర్హ సరదాగా మాట్లాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసి `ఐ మిస్ యూ అర్హ` అని రాసుకొచ్చాడు. `పుష్ప` సినిమా ఆగస్టు 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ సినిమాను బన్నీ పట్టాలెక్కిస్తాడు.