ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”అల వైకుంఠపురాములో” చిత్రంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తూనే ఉంది.ఇదే నేపదాయంలో ఈరోజు తెల్లవారుజామునే ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను స్ట్రీమింగ్ దిగ్గజం “నెట్ ఫ్లిక్స్” వారు సొంతం చేసుకున్నారని వార్తలు వచ్చాయి.దీనితో బన్నీ అభిమానుల్లో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది.ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను “సన్ నెక్స్ట్” వారు ఎప్పుడో దక్కించుకున్నారు కదా మళ్ళీ ఇదేంటి?అని అనుకున్న వారు.
అలాగే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పడేసిన వారు కూడా ఉన్నారు.దీనితో ఒక్కసారిగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ పై చిన్నపాటి హీట్ మొదలవ్వగా ఈ రూమర్లకు మెగా సన్నిహితుడు ఎస్ కె ఎన్ ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ వారు కొన్ని నెలల క్రితమే సొంతం చేసుకున్నారని నెట్ ఫ్లిక్స్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.అయితే ఇలా క్లారిటీ ఇవ్వగా సినిమా టీజర్ అప్డేట్ ఎప్పుడో చెప్పండి మొర్రో అంటూ బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా అడుగుతున్నారు.మొత్తానికి ఈ చిత్రం సాటిలైట్ హక్కులను “జెమినీ టీవీ” డిజిటల్ హక్కులను వారి సంస్థే అయిన “సన్ నెక్స్ట్” వారు సొంతం చేసుకున్న వార్తే ఫైనల్.