Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నాళ్లుగా మెగా మూవీ ‘నా పేరు సూర్య’, మహేష్ మూవీ ‘భరత్ అను నేను’ చిత్రాల విడుదల తేదీల విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రోజున విడుదల కాబోతున్నట్లుగా మొదట ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 27న ఈ రెండు చిత్రాలు విడుదల అవుతాయని అంతా భావించారు. అయితే అదే రోజున రజినీకాంత్ ‘2.0’ చిత్రం విడుదల ఉన్న కారణంగా కాస్త ముందే అంటే ఏప్రిల్ 22న మళ్లీ రెండు చిత్రాలు విడుదల కానున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టక తప్పదని సినీ వర్గాల వారు కూడా అనుకున్నారు. కాని తాజాగా ఇరు చిత్రాల నిర్మాతలు ఒక ఒప్పందంకు వచ్చి సినిమాల విడుదల తేదీల విషయంలో నెలకొన్న గందరగోళంకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
మహేష్‌బాబు ‘భరత్ అను నేను’ చిత్రాన్ని అదే డేట్‌కు విడుదల చేయబోతుండగా, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని మాత్రం రెండు వారాలు ఆలస్యం అంటే మే 5న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ 22న ‘భరత్ అను నేను’ చిత్రం విడుదల కాబోతుండగా, ఏప్రిల్ 27న రజినీకాంత్ ‘కాలా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత మే 5న ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు విడుదల తేదీలపై క్లారిటీ రావడంతో పాటు, మూడు చిత్రాలకు కూడా ఓపెనింగ్ సమస్య తలెత్తకుండా ఉంటుందని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.