Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రానికి ముందు వరుసగా పలు చిత్రాలతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘నా పేరు సూర్య’ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. వంశీ వక్కంతం దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించాడు. ఆ చిత్రం యావరేజ్‌గా ఉన్నా కూడా అంచనాలు భారీ స్థాయిలో వచ్చాయి. దాంతో సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిందనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ సమయంలోనే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంతో ప్రయోగాలు చేయవద్దని నిర్ణయించుకున్నాడు. నా పేరు సూర్య చిత్రం సక్సెస్ అయ్యి ఉంటే ఇప్పటికే తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అయ్యేది. కాని విక్రమ్‌తో సినిమా చేస్తే మరో ఫ్లాప్‌ను మూట కట్టుకోవాల్సి వస్తుందేమో అనే భయంతో బన్నీ ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు.
విక్రమ్‌తో సినిమా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మరో తమిళ దర్శకుడు అయిన లింగు స్వామితో ఈయన చిత్రం చేయాలని భావించాడు. అయితే ఆయన ప్రస్తుతం మరో సినిమాతో బిజీగా ఉన్న కారణంగా చేయలేను అంటూ చెప్పేశాడు. ఆ తర్వాత తనకు ‘డీజే’ వంటి భారీ కమర్షియల్ సక్సెస్‌ను ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలని అల్లు అర్జున్ ప్రయత్నించాడు. డీజేకు సీక్వెల్‌గా అప్పట్లోనే ఒక స్టోరీ లైన్‌ను హరీష్ చెప్పడం జరిగింది. ఇద్దరి కాంబో మూవీ దాదాపు ఫైనల్ అనుకుంటున్న సమయంలో షాకింగ్‌గా ఇప్పుడు కొత్త వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గీతాఆర్ట్స్‌లో అల్లు అర్జున్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. నిన్న మొన్నటి వరకు చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంతా ప్రచారం జరిగింది. చిరంజీవి కంటే ముందు అల్లు అర్జున్‌తో ఒక సినిమాను కొరటాల చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పలువురు దర్శకుతో చర్చలు జరిపి చివరకు కొరటాల వద్ద ఆగినట్లుగా తెలుస్తోంది.