Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం ‘నా పేరు సూర్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నా పేరు సూర్య తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటా అని గత కొంత కాలంగా మీడియాలో చర్చ జరుగుతుంది. తమిళ దర్శకుడు లింగుస్వామితో బన్నీ ఒక చిత్రం చేయాల్సి ఉంది. కాని ఆ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. బన్నీ తర్వాత సినిమా కూడా కొత్త దర్శకుడితోనే ఉండే అవకాశం ఉందని మెగా సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.
‘క్షణం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ దర్శకత్వంలో బన్నీ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. కేవలం కోటి బడ్జెట్తో ఏకంగా అయిదు కోట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన దర్శకుడు రవికాంత్ తాజాగా బన్నీకి ఒక కథ చెప్పడం, ఆ కథ బన్నీని బాగా ఇంప్రెస్ చేయడం జరిగింది. ఆ కారణంగానే కొత్త దర్శకుడితో సినిమా చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. కొత్త దర్శకులతో స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కాని బన్నీ మాత్రం కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మరోసారి కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. అతి త్వరలోనే బన్నీ, రవికాంత్ల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.