ఆర్యా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ !

Allu Arjun Upcoming Movie Director In Sukumar

మహా శివరాత్రి రోజునే తన కొత్త చిత్రాన్ని ప్రకటించి ఫ్యాన్స్ ను సప్రైజ్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తన 19 వచిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నాడని తెలిసిందే. ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లకముందే తన 20 వచిత్రం గురించి ఈ రోజు ప్రకటించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఈ 20వ చిత్రాన్ని చేయనున్నాడు ఈ స్టైలిష్ స్టార్. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకుముందు సుకుమార్, బన్నీ కలయికలో ఆర్య , ఆర్య2 సినిమాలు తెరకెక్కాయి. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక బన్నీ కి త్రివిక్రమ్ తో కూడా ఇది మూడో సారి కావడం విశేషం. ఇంతకుముందు వారిద్దరి కలయికలో జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు తెరకెక్కాయి. త్రివిక్రమ్ తో సినిమా పూర్తికాక ముందే బన్నీ మరో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా పూర్తి చేసే లోపే సుకుమార్ మహేష్ సినిమాను పూర్తి చేసి రావాలని ప్లాన్ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి సెట్ అయిన ఈ కాంబినేషన్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.