అల్లు అర్జున్ వరుసగా సక్సెస్‌ల తర్వాత ‘నా పేరు సూర్య’ చిత్రంతో భారీ ఫ్లాప్‌ను చవిచూశాడు. దాదాపు రెండు సంవత్సరాలు వరుసగా సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తూ వచ్చిన బన్నీకి నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్ రుచించడం లేదు. అందుకే మరో ఫ్లాప్ వద్దనే ఉద్దేశ్యంతో తదుపరి చిత్రానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే నా పేరు సూర్య చిత్రం విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని బన్నీ భావించాడు. అయితే నా పేరు సూర్య చిత్రం విషయంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న కారణంగా ఫ్లాప్‌ను చవిచూడాల్సి వచ్చింది. అందుకే తదుపరి చిత్రానికి మంచి కథను ఎంపిక చేసుకుని నటించాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ఇప్పటికే విక్రమ్ కుమార్‌తో కథలో పలు మార్పులు చేయించాడు అని, అయినా కూడా బన్నీకి కథ నచ్చడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే అల్లు అర్జున్, విక్రమ్ కుమార్‌ల మూవీ క్యాన్సిల్ అయ్యిందని, విక్రమ్ తమిళంలో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. బన్నీ తర్వాత సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని, ఆలస్యం అయినా కూడా అద్బుతమైన సినిమాతో బన్నీ వస్తాడు అంటూ వారు చెప్పుకొచ్చారు. మంచి కథ కోసం బన్నీ ఎదురు చూస్తున్నాడు అని, తాను రెడీ చేసుకున్న కథకు ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కుమార్ మసాలా యాడ్ చేసే పనిలో ఉన్నాడని, క్లాస్ ఆడియన్స్‌తో పాటు, మాస్ ఆడియన్స్‌ను కూడా కనెక్ట్ అయ్యేలా స్టోరీని రెడీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం చివరి వరకు వీరి కాంబో మూవీ ప్రారంభం అవుతుందని పీఆర్ టీం ప్రకటించింది.