నేను ఔటా..నాటౌటా మీరే చెప్పండి..? : రోహిత్ శ‌ర్మ

am i out or not out

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ క్యాచ్ ఔట్ విష‌యంలో థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. డీఆర్ఎస్ టెక్నాల‌జీ, అంపైర్ నిర్ణ‌యంపై క్రికెట‌ర్లు, విశ్లేష‌కులు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. బంతి, బ్యాట్‌కు మ‌ధ్య కొంత ఖాళీ ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌న్పిస్తున్న‌ప్ప‌టికీ ఔట్‌గా ప్ర‌క‌టించార‌ని రోహిత్ శ‌ర్మ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. తాను నాటౌట్ అని నిరూపించేందుకు ఇవాళ ట్విట‌ర్‌లో రీప్లే ఫొటోల‌ను షేర్ చేశాడు.

అస‌లేం జ‌రిగిందంటే.. కీమ‌ర్ రోచ్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేయ‌గా.. బంతి బ్యాట్‌, ప్యాడ్‌కు మ‌ధ్య‌లో నుంచి వెళ్లి వికెట్ కీప‌ర్ షెయ్ హోప్‌ చేతిలో ప‌డింది. విండీస్ అప్పీల్ చేయ‌గా అంపైర్ తిర‌స్క‌రించడంతో రివ్యూ కోరింది. రీప్లేలో స్నికోలో క‌న్పించిన స్పైక్ ఆధారంగా థ‌ర్డ్ అంపైర్ మైఖేల్ గాఫ్ ఔట్‌గా ప్ర‌క‌టించారు. బంతి బ్యాట్‌కు తాకిన‌ట్లు స్ప‌ష్టంగా ఏమీ క‌న్పించ‌లేదు. దీనిపై పూర్తి స్ప‌ష్ట‌త లేక‌పోయినా మూడో అంపైర్ ఔటివ్వ‌డంతో అంతా అవాక్క‌య్యారు. దీంతో రోహిత్ తీవ్ర నిరాశ‌గా మైదానాన్ని వీడాడు.