నిజామాబాద్ బోధన దవాఖానలో వైద్యపోస్టుల భర్తీ

medical posts in nizamabad teaching hospital

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులోభాగంగా నిజామాబాద్ ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు పద్ధతిన 64 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ పోస్టులకు జూలై 4న వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు నిజామాబాద్ వైద్యకళాశాల ప్రిన్సిపల్ కే ఇందిర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఈ నియామకాలు ఉంటాయని.. 2019 జూలై 31 నాటికి 39 ఏండ్లు పూర్తికాని వారిని అర్హులుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఏడాది కాలపరిమితిలో భర్తీచేసే మొత్తం 64 పోస్టుల్లో సీనియర్ రెసిడెంట్ 43, జూనియర్ రెసిడెంట్ 9, ట్యూటర్లు 2 పోస్టులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయా పోస్టుల కోసం అర్హతగలిగిన అభ్యర్థులు నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు తమ పేర్ల నమోదు చేసుకోవాలన్నారు. జూలై 4న ఉదయం 10.30 నుంచి నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ ఇందిర తెలిపారు.