సూర్య మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన రాజ‌మౌళి

rajamouli released first look of surya new movie

త‌మిళ స్టార్ హీరో సూర్య‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌, ప్ర‌ముఖ హీరో ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కేవీ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న చిత్రం క‌ప్పాన్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కప్పాన్‌’ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి ర‌క్ష‌కుడిగా ఉంటాడ‌ట‌. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగ‌ల్.. సూర్య స‌ర‌స‌న న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. బందోబ‌స్త్ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెలుగులో విడుద‌ల కానుంది.