అమలకు సమంత కౌంటర్… ఇన్ స్టా తో చెక్..!

టాలీవుడ్ లో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకస్థానముంది. ఈ మధ్య అక్కినేని కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఫిలింనగర్ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తోన్న ఈ వార్త ఈ మధ్య బాగా చక్కర్లు కొడుతుంది. నాగార్జున కుటుంబంతో చై-శామ్‌లు ఇద్దరు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్‌ జోరందుకుంది.

అందుకు తగినట్లుగానే ఈ మధ్య అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత, చైతన్య ఇద్దరూ అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమలకు దిమ్మతిరిగే ప్రశ్న ఎదురైంది. అదేమంటే… సమంత మీకు వంట చేసి పెడుతుందా..? అన్న ప్రశ్నకు తమ ఇంట్లో నాగార్జున బాగా వంటలు చేస్తారని. అలాంటప్పుడు ఇంకొకరు ఎందుకంటూ కామెంట్ చేశారు.

అంతేకాకుండా అక్కినేని కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ వంటలు చేయరని ఆమె అన్నారు. తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ట్రప్ఫెల్ మస్రూమ్‌ పాస్తాను తయారు చేసిన అక్కినేని కోడలు ఆ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో అమలకు కౌంటర్ ఇచ్చేందుకే సమంత ఆ పోస్ట్ చేసిందా..! అన్న కామెంట్లు జోరుగా ఊపందుకున్నాయి. తమ కుటుంబంలో ఆడవారు వంటి చేయరని చెప్పిన అమలకు సమంత ఊహించని కౌంటర్ ఇచ్చినట్లుగా ఉందని టాక్ విపరీతంగా వినిపిస్తోంది.