అమరావతి రాజధానిగా కొనసాగడం కష్టం అని వైసీపీ నేతలు అన్న విషయం అందరికి తెలిసిందే. అమరావతి నిర్మాణానికి లక్ష 10 వేల కోట్ల రూపాయలు అవసరమని, అవి ఇపుడు ప్రభుత్వం భరించలేదని, 10 వేల కోట్లతో విశాఖని హైదరాబాద్ కంటే అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల తీరు ఫై, వైసీపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధాని ఫై కాలయాపన చేయడం తగదని, ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని పవన్ డిమాండ్ చేసారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ పదే పదే చెబుతున్నారని అన్నారు. అధికారం చేతిలో వున్నపుడు చర్యలు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. అయితే అప్పటి ప్రతిపక్ష నేతగా అమరావతికి ఆమోదం తెలిపి, ఇపుడు మూడు రాజధానులు అంటూ ప్రతిపాదించడం పట్ల విమర్శలు గుప్పించారు. ఇపుడు పెట్టే రాజధాని అయినా అందరి ఆమోదం తో నిర్ణయించాలని పవన్ అన్నారు.