కొత్తిమీరను సాధారణంగా రుచికోసం ఆహార తయారీలలో వాడుతూ ఉంటాము. కానీ కొత్తిమీర వలన రుచి మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుసు చూద్దాం. కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్’ని కలిగి ఉంటుంది అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. అలాగే చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది.
కొత్తిమీరలో ‘ఎసేన్షియాల్ ఆయిల్స్’ ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్’ను తగ్గించుటలో సహాయపడుతుంది. విటమిన్స్, మినరల్స్ విషయంలో కూడా కొత్తమీరని ప్రధానంగా చెప్పుకోవచ్చు వాటితో పాటు ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K’ కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్’ కొత్తిమీరలో ఎక్కువగా ఉంటాయి. కొత్తిమీర జీర్ణక్రియని కూడా పెంచుతుంది. ఇదొక్కటే కాక జీర్ణక్రియ వ్యాధులు, అజీర్ణం, వాంతులు, వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్’లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది, శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.