‘బ్రో’లో శ్యాంబాబుగా అంబటి రాంబాబు.. పవన్ పై అంబటి హాట్ ట్వీట్..?

Pawan Kalyan
Pawan Kalyan

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి’ అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.

పవన్ తాజా చిత్రం ‘బ్రో’లో అంబటిని టచ్ చేసేలా ఓ సన్నివేశం ఉంది. గతంలో సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు డాన్స్ చేసిన సన్నివేశమే ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయని విధంగా ఈ చిత్రంలో ఉంది. అంబటి వేసిన విధంగానే నటుడు పృథ్వీతో డ్యాన్స్ చేయించారు. అంతేకాదు ఆరోజున అంబటి వేసుకున్న డ్రెస్ నే పృథ్వీకి ధరింపజేశారు.

పవన్ కొట్టే డైలాగ్ కూడా అంబటికి సూటిగా తగిలేలా శ్యాంబాబు.. వస్తున్న నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? ఒక్కో స్టెప్ కి ఒక్కో భావం ఉంటుందయ్యా అని చెప్తూ డాన్స్ లో రకాలు చెప్తాడు. కళలు , లలిత కళలు అన్ని మాలాంటి కళాకారులకు వదిలెయ్యండమ్మా , మీ లాంటి వాళ్ళ దయచేసి ఇన్ వోల్వ్ అవ్వొద్దు ప్లీజ్ తాగు , తూగు తట్టుకుంటాం ట్రేండింగ్ , ట్రోలింగ్ కి తేడాలేకుండా బిగించెయ్యకండయ్యా ప్లీజ్ అంటు పవన్ ప్రశ్నిస్తారు. ఈ సీన్ నేపథ్యంలోనే అంబటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు.