‘శ్రీ లీల వలనే రష్మిక స్టార్ హీరోయిన్ ! కారణమేంటంటే ?

Srileela
Srileela

ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రీలీల. వరుస సినిమాలతో దూసుకుపోతూ హిట్ల మీద హిట్లు కొడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. “పెళ్లి సందడి” సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తను నటించిన మొదటి సినిమాలో హావభావాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. నటన,అందం , అభినయంతో అగ్ర హీరోలు అందరి సరసన నటించి క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఈ క్రేజ్ తనకు పెళ్లి సందడి సినిమాతో కాకుండా చలో సినిమాతో రావాల్సి ఉందట. చలో సినిమాలో మొదటగా రష్మిక కన్నా ముందు స్టార్ హీరోయిన్ శ్రీ లీలను అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల శ్రీలీలా ఈ సినిమాలో నటించలేదట. మొదటగా ఈ సినిమాలో శ్రీ లీలను హీరోయిన్గా అందరూ అనుకున్నారట.

కానీ శ్రీలీలా ఈ సినిమాలో నటించకపోవడం వల్లే రష్మికకు అంత క్రేజ్ వచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో శ్రీ లీలా కనుక నటించి ఉంటే రష్మికకు ఇంత క్రేజ్ వచ్చి ఉండేది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోవడంతో రష్మికను సెలెక్ట్ చేసారు. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి నేషనల్ క్రష్ గా పేరును సంపాదించుకుంది రష్మిక.