అమెరికాలో జాతి వివాదం, ఆరకమైన ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. అసలే ఈ మధ్య నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి నిరసనలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళనలు చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ఆరంభమయ్యాయి. ఈ ఘటనతో ఆ నగర పోలీసు చీఫ్ రాజీనామా చేశారు. రెషార్డ్ బ్రూక్ అట్లాంటాలోని ఓ రెస్టారెంటు ముందు రాత్రి సమయంలో కారును నిలిపి అక్కడే నిద్రపోయాడు. ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకొని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు ఘర్షణకు దిగాడు.