అమెరికాలో ఈరోజు తెల్లవారు జామున ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జార్జియాలో విమానం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బంధువు అత్యక్రియలకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు అదికారులు వెల్లడించారు. కాగా ఫ్లోరిడా నుంచి ఇండియానాకు బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుందని అధికారులు వివరించారు.