బంగ్లాదేశ్ దేశస్థులని దక్షిణా ఆసియా వాసులను అమెరికా తమ దేశం నుంచి వెళ్ల గొట్టింది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ఈ అక్రమ వలస దారుల్లో ఎక్కువగా 20 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమంగా అమెరికాకు పంపించడానికి అంతర్జాతీయ ఏజెంట్లు ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి పది లక్షల నుండి పదిహేను లక్షలు వసూలు చేశారని సమాచారం.
అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని 145 మంది భారతీయులను వెనక్కు పంపించింది. ఈ రోజు వారంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
అంతర్జాతీయ ఏజెంట్ల ద్వారా అమెరికాలోకి అక్రమంగా వెలిన వారు, వీసా గడువు పూర్తయినా కూడా అమెరికాలోనే నివాసము ఊంటున్న భారతీయులు ఈ లిస్టులో ఉన్నారు.