బళ్ళారి పర్యటనకి షా డుమ్మా… అందుకేనా ?

Amit Shah escape Bellary election Campaign

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బళ్ళారి అవడానికి కర్ణాటకలోని ఒక ప్రాంతమే అయినా ఆ పేరు వరల్డ్ ఫేమస్… దేనికి అంటారేమో అదే నండీ మన మైనింగ్ కింగ్ గాలి జానర్ధాన్ రెడ్డి వల్లన, ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాజుగా వెలిగిపోయాడు ఆయన కొన్నేళ్ళు. అది ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన హవా పోయింది. బళ్ళారిని తన స్థావరంగా చేసుకొని కొన్ని లక్షల కోట్లు గాలి అక్రమ గనుల తవ్వకాల్లో కొల్లగొట్టారని రుజువు అవటంతో మూడు సంవత్సరాలకి పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందాన మరలా బళ్ళారిలో తన మార్క్ రాజకీయాల్లో వేసేందుకు సిద్దం అయ్యాడు. తన అనుచరులు , బంధువులు మొత్తం కలిపి ఎనిమిది మందికి బీజేపీ సీట్లు ఇప్పించుకున్నాడు. అమిత్ షా గాలి కి మాకు సంభందం లేదంటున్నా, మొతానికి ఎనిమిది సీట్లు మాత్రం గాలి అనుచరులకే కట్టబెట్టారు.

అయితే రహస్యంగా గాలి జనార్దన్ రెడ్డితో బీజేపీ అధిష్టానం టచ్లోనే ఉందని తెలుస్తుండగా ఇప్పుడు అనూహ్యంగా గాలికి అమిత్ షా ఝలక్ ఇచ్చారు. గాలి సోదరుల సొంత గడ్డ అయిన బళ్ళారి జిల్లాలో శుక్రవారం జరిగే ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా కూడా అక్కడికి వెళ్లి పాల్గొనవలసి ఉంది, అయితే చివరి క్షణంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేయనున్నట్టు తేల్చి చెప్పారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని వివాదాస్పద చర్చల్లో కూరుకుపోయిన గాలి సోదరులతో వేదికాలో పాలు పంచుకోవలసిన అగత్యాన్ని తప్పించుకోవడానికే అమిత్ షా తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ విధంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారని బీజేపీ వర్గాలు సమాచారం.

ఒక పక్క గాలి సోదరులకి తమకి ఎటువంటి సంబంధం లేదని అమిత్ షా అంటుంటే ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి మాత్రం తాను రెడ్డి సోదరులను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా క్షమించానని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ యడ్యూరప్పపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సోదరులు కర్ణాటక చరిత్రలో అతి పెద్ద నేరస్థులని ఆరోపించారు. ఈ అంశాన్ని కన్నడ మీడియా హైలైట్ చేయడంతో బళ్ళారి బయలుదేరిన అమిత్ షా పునరాలోచనలో పడినట్టు సమాచారం. అవినీతిపరుల మీదనే మా యుద్ధం అని వేదాలు వల్లించే బీజేపీ ఇప్పుడు వారికే సీట్లు ఇచ్చి వారి ప్రచారం కోసం వస్తున్నారు అని ఈ సారి మీడియా తన మీద ఎక్కడ పడుతుందో అని అమిత్ షా భయపడుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన తన బళ్ళారి ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం.