Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీకి మిత్రపక్షం బీజేపీ పక్కలో బల్లెంలా మారేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి. ఇప్పటికే విజయవంతంగా ఉప రాష్ట్రపతి పదవి పేరుతో వెంకయ్య నాయుడుని పక్కకి తప్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంకో షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే ఏపీ బీజేపీ అధ్యక్షుడు, వెంకయ్య శిష్యుడు, వీర విధేయుడు కంభంపాటి హరి బాబుని సీన్ లో నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలు అయ్యాయట. అయితే వెంకయ్య ఎపిసోడ్ మర్చిపోక ముందే హరి బాబుని తప్పిస్తే ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని తమ మీద మచ్చ పడకుండా ఓ ప్లాన్ రెడీ చేశారట.
హరిబాబు టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న అమిత్ షా ఆయనకి కేంద్రమంత్రి పదవితో ప్రమోషన్ ఇచ్చినట్టు ఇచ్చి పక్కకి తప్పించబోతున్నట్టు తెలుస్తోంది. అప్పుడు చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ఇంకోరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారట. ఇందుకోసం గురువు వెంకయ్య మీద ప్రయోగించిన ప్రమోషన్ ప్లాన్ ని ఇప్పుడు శిష్యుడు హరిబాబు మీద కూడా అమిత్ షా ప్రయోగిస్తున్నారు. ఈ ప్లాన్ కి మోడీ ఆమోదం లభించగానే అమల్లోకి తెస్తారట. ఏదేమైనా అమిత్ షా వింత రాజకీయమే చేస్తున్నారు. పడని వాళ్లకి ప్రమోషన్ తో కూడా పొగ పెట్టొచ్చని నిరూపిస్తున్నారు.
మరిన్ని వార్తలు