పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు జ‌యా….

Amitabh Bachchan and abhishek bachchan birthday wish for Jaya Bachchan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు. కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన విశేషాలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న బ్లాగ్ లో పంచుకుంటుంటారు. అలాగే ఇవాళ భార్య జ‌యాబ‌చ్చ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భాన్ని కూడా అమితాబ్ తన బ్లాగ్ లో గుర్తుచేసుకున్నారు. జ‌యాబ‌చ్చ‌న్ 70 వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రియ‌మైన భార్య‌ను గుర్తుచేసుకుంటూ త‌న బ్లాగ్ లో ఓ లేఖ రాశారు అమితాబ్. రాత్రి 12 అవ‌గానే శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి ఫోన్లు, మెసేజ్ లు వ‌స్తూనే ఉన్నాయ‌ని అమితాబ్ చెప్పారు. స్వీటు తినిపించి భార్య‌ను 70వ వ‌సంతంలోకి ఆహ్వానించాన‌ని తెలిపారు. భార్య‌గా, త‌ల్లిగా జ‌య అన్ని బాధ్య‌త‌లూ స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తోంద‌ని ప్ర‌శంసించారు. గ‌తంలో జ‌య‌ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా..తాను రాసిన లేఖ‌లు, కురిపించిన ప్రేమ‌..ఆనాటి విష‌యాలు అన్నీ ఒక్క‌సారిగా గుర్తొచ్చాయని లేఖ‌లో భావోద్వేగం వ్య‌క్తంచేశారు అమితాబ్. అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా త‌ల్లికి సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు చెప్పారు. హ్యాపీ బ‌ర్త్ డే అమ్మా..నువ్వే నా ప్ర‌పంచం. ల‌వ్యూ అంటూ జ‌య పాత‌కాలం నాటి ఫొటోను షేర్ చేశారు. ఎన్నో చిత్రాల్లో క‌లిసి న‌టించిన అమితాబ్, జ‌య 1973లో వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత కూడా వారిద్ద‌రూ కొన్ని సినిమాల్లో న‌టించారు.