Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమితాబ్ బచ్చన్ ఏం చేసినా సంచలనమే. అలాంటిది ఆయన కుటుంబమంతటితో కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట్లో కనబడితే ఎవరైనా వదులుతారా..ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది కదా..ఇప్పుడదే జరుగుతోంది. ఇటీవలే 75వ పుట్టినరోజును అమితాబ్ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో జరుపుకున్నారు. గత ఏడాది కూడా పుట్టినరోజు సందర్భంగా అమితాబ్ కుటుంబం మాల్దీవులకే వెళ్లింది. అప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి ఓ బోటుపై కూర్చుని ఫొటో దిగారు. అమితాబ్, జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య, అమితాబ్ కూతురు శ్వేతానంద ఈ ఫొటోలో ఉన్నారు.
ఈ ఏడాదీ కుటుంబ సభ్యులందరూ కలిసి అలాగే పడవపై కూర్చుని ఫొటో దిగారు. అయితే ఈ ఫొటో మొదట బయటకు రాలేదు. అమితాబ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులుకానీ ఈ ఫొటోలను పోస్ట్ చేయలేదు. దీంతో అమితాబ్ పుట్టినరోజుకు సంబంధించిన వార్తలు రాసేటప్పడు పత్రికలు, వెబ్ సైట్లు, టీవీ చానళ్లు గత ఏడాది ఫొటోనే చూపించాయి. విషయం తెలియక చాలా మంది అది ఈ ఏడాది ఫొటోనే అనుకున్నారు కూడా. అయితే ఎలా వచ్చిందో తెలియదు కానీ…
తాజా పుట్టినరోజు ఫొటో ఒకటి బయటకు వచ్చింది. కుటుంబసభ్యులంతా అలానే బోటుపై కూర్చుని ఫొటో దిగారు కానీ..ఈ ఏడాది ఫొటోలో ఇంకో మెంబర్ యాడయ్యారు. అమితాబ్ కూతురు శ్వేతానంద కుమార్తె నవ్య నవేలి నందా ఈ సారి ఫొటోలో కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చూసి అమితాబ్ సర్ ప్రైజ్ అయ్యారు. ఈ ఫొటో మీకెలా దొరికింది అని అభిమానులను ప్రశ్నించారు. తర్వాత అభిషేక్ బచ్చన్ కూడా ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోనే ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్…. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 102 నాటౌట్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటిస్తున్నారు.