చిరు వల్ల నరకం అనుభవిస్తున్నా..!

Amitabh Bachchan Say Chiru In Sye Raa

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ ఈ వయస్సులో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తన వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ ఎక్కువ ఇబ్బంది పడకుండా, కష్టం లేకుండా అమితాబచ్చన్‌ సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా అమితాచ్చన్‌ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం అమితాబచ్చన్‌ పెద్ద గడ్డం మరియు విగ్‌ను ధరించాల్సి వస్తుంది. వేసవిలో ఆ విగ్గు, గడ్డంతో నరకం అనుభవిస్తున్నాను అంటూ అమితాబచ్చన్‌ ట్వీట్‌ చేశాడు. 

చాలా సంవత్సరాల క్రితం తాను విగ్గు ధరించొద్దని, గడ్డం పెట్టుకోవదని నిర్ణయించుకున్నాను. కాని చిరంజీవి సినిమా కోసం, ఆయనపై ఉన్న అభిమానంతో ఈ చిత్రంను చేస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడో వద్దనుకున్న వాటిని ఇప్పుడు పెట్టుకుంటున్నాను. వీటివల్ల నరకం అనుభవిస్తున్నాను అంటూ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ పేర్కొన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు అమితాబ్‌ చేయడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. ఈ వయస్సులో బిగ్‌బి ఇలాంటి కష్టమైన కాస్ట్యూమ్స్‌ను, మేకప్‌ను వాడటం మంచిది కాదని కొందరు ఆయన అభిమానులు అంటున్నారు. త్వరలోనే సైరా చిత్రీకరణను అమితాబచ్చన్‌ పూర్తి చేయబోతున్నాడు.

చిరు వల్ల నరకం అనుభవిస్తున్నా..! - Telugu Bullet