Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Amitha Bachchan Suggestion To Rajini Kanth
సినిమాల్లో నాకు తమ్ముడిలా నటించావ్. ఇప్పుడు కూడా నీకు శ్రేయోభిలాషిగా చెబుతున్నా. ఎందుకొచ్చిన రాజకీయాలు. ఒక్కసారి ఎంపీగా గెలిచిన పాపానికి నాకే స్కామ్ అంటగట్టారు. చివరకు బోఫోర్స్ భూతం నుంచి తప్పించుకోవడానికి ఏళ్ళూ, ఊళ్లూ పట్టింది. అంతెందుకు రీసెంట్ గా చిరంజీవి ఎపిసోడ్ చూశావుగా.. ఇంకా ఎందుకు రాజకీయాలంటావు. ఇదీ రజనీకి బాలీవుడ్ మెగాస్టార్ చేసిన హితబోధ.
రాజకీయాలపై అమితాబ్ ను సలహా అడిగిన రజనీకి.. దిమ్మ తిరిగే ఆన్సర్ వచ్చింది. పైగా కూల్ గా సినిమాలు చేసుకోకుండా.. ఎందుకొచ్చిన రాజకీయాలన్న అమితాబ్ స్పందన తో రజనీ కూడా కలవరపడ్డారట. చిరంజీవి ఎపిసోడ్ ను గుర్తుచేసేసరికి.. రజనీ ధైర్యం కూడా తగ్గిపోయి ఉంటుందని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం అమితాబ్ సలహా మాత్రమే ఇచ్చారంటున్నారు.
నిజంగా అమితాబ్ ను అన్నగా భావించే రజనీ ఆయన సలహా పాటిస్తారా.. లేదంటే చావోరేవో తేల్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఒత్తిళ్లు ఎక్కువ కాబట్టి రజనీ ఆరోగ్యం పాడవుతుందేమోనని, భార్య, కూతుళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే అల్లుడు ధనుష్ మాత్రం రజనీ పొలిటికల్ ఎంట్రీకి అనుకూలంగానే ఉన్నారు. చూడాలి మరి రజనీ ఏం నిర్ణయం తీసుకుంటారో.