కన్నకూతురు కులాంతర వివాహం చేసుకుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆమె భర్త ప్రణయ్ ను మారుతీరావు దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడకు చెందిన ఈ ఘటనకు సంబంధించి అమృత తండ్రి, బాబాయ్ లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో తన తండ్రి, బాబాయ్ ల గురించి అమృత వెల్లడించిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి, బాబాయ్ లు ఇద్దరూ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులే అని అమృత వెల్లడించింది. బాబాయ్ కి భార్య ఉండగా వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆయన కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది.
ఈ ఘటన జరిగినప్పుడు తాను బీటెక్ చదువుతున్నానని, బాబాయ్ కొడుకు 8వ తరగతి చదువుతున్నాడని చెప్పింది. ఇదే విషయాన్ని బాబాయ్ కి చెబితే… అబ్బాయిలు అలాగే ఉంటారు, నీవు జాగ్రత్తగా ఉండాలి అని సలహా ఇచ్చాడని వెల్లడించింది. అంతేకాక కొడుకు పోర్న్ వీడియోలు చూస్తున్నాడని అతని తల్లికి చెబితే వాటిని చూడకపోతే అబ్బాయి అని ఎలా అనిపించుకుంటాడు? అంటూ వెనకేసుకొచ్చిందని అమృత తెలిపింది. ఒక తల్లి ఇలాంటి వాటిని వెనకేసుకు రావడం సమంజసమేనా? అని ప్రశ్నించింది.
తనతో పాటు తమ బంధువులలో ఉన్న చాలా మంది అమ్మాయిలతో బాబాయ్ కొడుకు ఇలాగే ప్రవర్తించాడని చెప్పింది. అదే విధంా ఒక్క ఛాన్స్ ఇస్తే తండ్రిని చంపుతానని ఆమె పేర్కొనడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.