కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్‌..!

An unexpected shock for Pawan Kalyan in Krishna district..!
An unexpected shock for Pawan Kalyan in Krishna district..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పవన్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని నోటీసులిచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పేర్కొన్నారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలోనే..పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్బంగా కృష్ణాజిల్లా ఎస్పి జాషువా మాట్లాడుతూ.. పెడన పోలీసు స్టేషను పరిధిలో తోటమూల సెంటరులో బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసారు…తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారని తెలిపారు. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేసాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైనా పూర్తి పరిశీలన చేసాం…పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామన్నారు. అలాంటి అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటా…ఎటువంటి సమాచారం తో అలాంటి వ్యాఖ్యలు చేసారని వివరించారు. కానీ తమ నోటీసుకు పవన్ నుంచీ రిప్లై రాలేదన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.