భారత సరిహద్దులో చైనా, పాక్ సమావేశం

భారత సరిహద్దులో చైనా, పాక్ సమావేశం
China & Pakisthan

పాకిస్థాన్, చైనాల నుంచి భారత్‌కు ముప్పు ఉన్నవేళ.. భారత్ సరిహద్దు ప్రాంతంలో సమావేశానికి చైనా సిద్ధమైంది. ఈరోజు మరియు రేపు టిబెట్‌లోని న్యాంగ్చిలో జరిగే ట్రాన్స్-హిమాలయన్ ఫోరమ్ 3వ సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ గిలానీ కూడా హాజరుకానున్నారు. సభాస్థలం అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంలో ఉంది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు ఈ సమావేశాలకు హాజరవుతున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మంగోలియా, ఆఫ్ఘనిస్థాన్‌ల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య ఆచరణాత్మక సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో 2018లో ట్రాన్స్-హిమాలయన్ ఫోరమ్ ప్రారంభించబడింది. ఇది పర్యావరణ పరిరక్షణ, భౌగోళిక కనెక్టివిటీ మరియు సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో స్థాపించబడింది.