తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi is coming to Telangana on 18th of this month..
Rahul Gandhi is coming to Telangana on 18th of this month..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వరుస పర్యటనలతో సమరశంఖం పూరించిన ప్రధాని మోదీ…. నిజామాబాద్‌ సభా వేదికగా అధికార బీఆర్ఎస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు సభలో హామీలపై దృష్టి సారించిన ప్రధాని.. ఇందూరు సభలో మాత్రం బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే..ఆ దోపిడీనంతా కక్కిస్తామని, కేసీఆర్ కుటుంబ పాపాలన్నింటినీ బయటపెడతామని అన్నారు.

మోదీ సభపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్పందించాయి. మోదీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ లు గల్లీలో లొల్లి పెట్టుకుంటూ.. దిల్లీలో దోస్తీ చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక తాజాగా మోదీ ప్రసంగంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను చెప్పింది నిజామాబాద్‌ సభలో మోదీ అంగీకరించారని రాహుల్‌ గాంధీ అన్నారు.

‘బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్‌ సమితి. బీఆర్ఎస్- బీజేపీ భాగస్వామ్యం పదేళ్లలో తెలంగాణను నాశనం చేసింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్- బీజేపీని గమనిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.’ అని రాహుల్ గాంధీ అన్నారు.Rahul G