పాతబస్తీలో దారుణం, ఓ యవకునిపై కత్తులతో దాడి

పాతబస్తీలో దారుణం, ఓ యవకునిపై కత్తులతో దాడి
attack on a young man with knives

హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. సయ్యద్ ఇర్ఫాన్ అనే 29 ఏళ్ల యువకుడిని ఐదుగురు గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడింది ఎవరు, ఎందుకు చేశారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.