Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Anasuya And Adivisesh Insulated In Filmfare Awards
తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుకకు కొందరిని ఆహ్వానించక పోవడం ప్రస్తుతం విమర్శలకు తావు ఇస్తుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినీల జాబితాలో ‘క్షణం’ చిత్రంలో నటించిన అడవి శేషు మరియు అనసూయలు పేరు దక్కించుకున్నారు. అయితే వారిద్దరికి మాత్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నిర్వహకుల నుండి ఆహ్వానం అందలేదు. దాంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొదట ‘క్షణం’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించిన అడవి శేషు ట్విట్టర్‌లో నామినీలో ఉన్న తనకు ఆహ్వానం అందించకుండా, చివరి నిమిషంలో క్షమాపణలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదే విషయాన్ని అనసూయ కూడా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. నీకు క్షమాపణలు అయినా చెప్పారు. కాని నాకు ఆహ్వానం అందించక పోగా, కనీసం అపాలజీస్ అయినా చెప్పలేదని అనసూయ ఆవేదన వ్యక్తం చేస్తూ అడవి శేషు ట్వీట్‌కు రీ ట్వీట్ చేసింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొందరికి ఆహ్వానాలు అందలేదని, టైం తక్కువ ఉన్న కారణంగా అందరికి ఆహ్వానాలు పంపించలేక పోయామని ఫిల్మ్‌ఫేర్ అవార్డు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ అవార్డు వేడుక హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనం జరిగింది. భారీగా సినీ సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో హాజరు అయ్యారు.