Anasuya : ఎక్స్పోజింగ్ చేయడం చాలా కష్టం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనసూయ. అనసూయ బుల్లితెరపై తన ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు వెండితెరపై తన సత్తా చాటునుండి . ఓవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ లు చేస్తూనే మరోవైపు అగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంది . అలా వచ్చినవే రంగమ్మత్త, దాక్షాయణి పాత్రలు.
ఈ పాత్రల్లో అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా ఓవైపు వెండితెరపై సందడి చేస్తూనే బుల్లితెరపైనా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ తన ఫొటోలతో పాటు అప్పుడప్పుడు తన పోస్టులతోనూ సంచలనం సృష్టిస్తూ ఉంటున్నది . అయితే..అలనాటి తారల వేషధారణలో కనిపించడంపై యాంకర్ అనసూయ ఆసక్తికర వాక్యాలు చేశారు. తన పెర్ఫార్మన్స్ తో లెజెండరీ తారలకు నివాళి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ కూడా చేశారు. దీనికి ‘ఎక్స్పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా… సావిత్రిలా యాక్ట్ చేయడం ఎవరి తరం కాదని అనసూయ పేర్కొన్నారు. ఎక్స్పోజింగ్ చేయడం కూడా తేలిక కాదని….దానికి మానసికంగా ప్రిపేర్ అవ్వాలని బదులిచ్చారు.