ఎట్టకేలకు స్పందించిన ప్రదీప్‌

anchor Pradeep Machiraju accepts his Mistake,
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యాంకర్‌ ప్రదీప్‌ డిసెంబర్‌ 31 రాత్రి సమయంలో తాగి కారు నడుపుతూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెల్సిందే. కొన్ని వందల మంది ఆ రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. కాని ప్రదీప్‌ విషయం మాత్రం మీడియాలో ఓ రేంజ్‌లో పబ్లిసిటీ అయ్యింది. బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని, అమ్మాయిలు ఎక్కువగా కోరుకునే యాంకర్‌గా ప్రదీప్‌ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి యాంకర్‌ ప్రదీప్‌ డ్రంగ్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడటంతో రెండు రోజుల పాటు మీడియాలో పెద్ద సెన్షేన్‌ న్యూస్‌ అయ్యింది. డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్‌ పోలీసుల కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదు.

పోలీసులు పిలిచిన డేట్లలో కౌన్సిలింగ్‌కు ప్రదీప్‌ హాజరు కాకపోవడంతో పరిస్థితి మళ్లీ సీరియస్‌గా మారిపోయింది. ప్రదీప్‌ గురించి మీడియాలో పలు రకాలుగా రాయడం ప్రారంభం అయ్యింది. ప్రదీప్‌ అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లి పోయాడు అని, ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడని, కౌన్సిలింగ్‌కు తాను హాజరు కావాలని కోరుకోవడం లేదు అంటూ ప్రచారం జరిగింది. దాంతో ప్రదీప్‌ మీడియా ముందుకు వచ్చాడు. కౌన్సిలింగ్‌కు తాను దూరంగా ఉండాలని భావించడం లేదు, చట్ట ప్రకారం తాను ముందుకు వెళ్తాను.

ముందుగా అనుకున్న షూటింగ్స్‌ కారణంగా తాను పోలీసు వారు పిలిచిన డేట్లలో కౌన్సిలింగ్‌కు హాజరు కాలేక పోయాను. త్వరలోనే తప్పకుండా కౌన్సిలింగ్‌కు హాజరు అవుతాను. తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దంటూ ఒక వీడియో సందేశంను మీడియాకు ప్రదీప్‌ పంపడం జరిగింది. ప్రదీప్‌కు ఎలాంటి కౌన్సిలింగ్‌ ఉంటుందనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. తాను కౌన్సిలింగ్‌కు దూరంగా ఉండాలని భావించడం లేదని, అలాగే చట్టం ప్రకారం నడుచుకుంటాను అంటూ ప్రదీప్‌ చెప్పడంతో ఆయనపై వస్తున్న పుకార్లకు చెక్‌ పడ్డట్లయ్యింది.