నాన్‌ ‘బాహుబలి’ రికార్డ్‌ ‘అజ్ఞాతవాసి’ టార్గెట్‌

pawan kalyan agnathavasi targeting on non bahubali record
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా చరిత్రను ‘బాహుబలి’ తిరగరాసింది. ఇప్పట్లో ఏ చిత్రం కూడా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్‌ చేయలేవు. ముఖ్యంగా ‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్‌ అవ్వాలి అంటే కనీసం రెండు మూడు దశాబ్దాలు అయినా పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సినిమా పరిశ్రమ వారు నాన్‌ బాహుబలి రికార్డు అంటూ ఒకటి క్రేయేట్‌ చేశారు. బాహుబలి కాకుండా నెం.1 అంటూ ఒక వర్గం వారు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఖైదీ నెం. 150 చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులో నెం.1 స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ రికార్డును పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు.

పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం పవన్‌కు 25వ చిత్రం అవ్వడం వల్ల కూడా సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించాడు. విడుదలకు ముందే దాదాపు 150 కోట్ల బిజినెస్‌ను చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఏకంగా 7 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు మరియు తమిళనాడులో కూడా భారీగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ కారణంగా సినిమా సంచలన వసూళ్లు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సంక్రాంతి సీజన్‌కు వచ్చిన ‘ఖైదీ నెం.150’ చిత్రం రికార్డులను అదే సంక్రాంతికి రాబోతున్న అజ్ఞాతవాసి చిత్రం సునాయాసంగా బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.