తెలుగు మహిళ ప్రేక్షకులకు ఈటీవీలో ప్రసారం అయ్యే ‘స్టార్ మహిళ’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 12 ఏళ్లుగా కొనసాగుతున్న స్టార్‌మహిళ కార్యక్రమం 3 వేల ఎపిసోడ్స్‌కు పైగా పూర్తి చేసుకుంది. ఇంత భారీ స్థాయిలో, ఎక్కువ రోజులు ప్రసారం అయిన షోగా స్టార్ మహిళకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది.ఈటీవీలో మద్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం అయ్యే ఈ షోకు మహిళల నుండి మంచి ఆధరణ ఉంది. సుమ మహిళలతో ఆడిచ్చే ఆటలు షోకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా మంచి టాక్ ఉంది. ఆడవారు స్టార్ మహిళ చూస్తున్నారు అంటే పార్టిసిపెంట్స్ చీరలు, డ్రస్‌లు కూడా ఒక కారణంగా చెబుతూ ఉంటారు.
ఇంతటి సక్సెస్‌ను దక్కించుకున్న స్టార్ మహిళ షోకు గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా సుమ ప్రకటించింది. 12 ఏళ్ల పాటు నన్ను ఆధరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన సుమ మహిళ లోకంకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమ గత కొంత కాలంగా గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంది. ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి ఆమెకు వచ్చింది. దాంతో పలు షోలకు యాంకరింగ్ చేయకపోవడంతో పాటు, ఆడియో వేడుకలను కూడా సుమ తగ్గించుకుంది. దాంట్లో భాగంగానే స్టార్ మహిళ నుండి తప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. సుమ తప్పుకుంటున్న నేపథ్యంలో మరో యాంకర్‌తో కార్యక్రమంను కొనసాగించొచ్చు. కాని కార్యక్రమ నిర్వాహకులు అలా భావించడం లేదు. సుమ లేని స్టార్ మహిళను రన్ చేయడం బాగోదని షోను కూడా ఎండ్ చేస్తున్నారు.