రాజమౌళి తో ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ

రాజమౌళి తో ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ

నాని నిర్మాతగా తీస్తున్న ‘హిట్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ సుమ కొద్ది సేపు తన సమయస్పూర్తి తో ఆ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన రాజమౌళి తో ఒక ఆట ఆడుకుంది.ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ గురించి రాజమౌళి నోటి వెంట క్లారిటీ చెప్పించడానికి ప్రయత్నిస్తూ సుమ జక్కన్న పై కొందరు కేసులు వేస్తున్నారు అంటూ ఒక ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టింది.

ఈ అనుకోని ప్రశ్నకు కొద్దిగా షాక్ అయిన రాజమౌళి దీనికి హీరోల పేర్లు కూడా జతచేస్తూ రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులు కేసులు పెట్టలేదా అంటూ సుమను కార్నర్ చేసాడు. దీనితో సుమ మరింత రెచ్చిపోయి మా హీరోలను మీ దగ్గర పెట్టుకున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆందోళనలో అందరు ఉన్నారు అంటూ సుమ మరో ట్విస్ట్ ఇచ్చింది.రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ 2021 జనవరి 8న విడుదల ఖాయం అంటూ అతడి నోటి వెంట మాటలు వచ్చే వరకు ఈ జోక్స్ కొనసాగుతూనే ఉన్నాయి.