ఎట్టకేలకు యోగీ క్యాబినెట్ విస్తరణ 

And finally the Yogi Cabinet expansion

ఉత్తరప్రదేశ్‌లో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించింది బీజేపీ ప్రభుత్వం. 18 మందికి కొత్తగా మంత్రిపదవులు దక్కగా, సహాయ మంత్రులుగా ఉన్న మరో ఐదుగురికి కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి కల్పించింది.

ప్రస్తుత మంత్రివర్గంలోని ఐదుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్త మంత్రుల చేత గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌,  రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు.

ఈ 23 మందిలో ఆరుగురు కేబినెట్‌ మంత్రులుగా, మరో ఆరుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, ఇంకో 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.