కొత్త వాహన చట్టం తో జేబుకు చిల్లు

Drill pocket with new vehicle law

రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడానికి మోటారు వాహనాల చట్టాన్ని సవరణకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.  ప్రస్తుతం అమలులో ఉన్న వెహికల్ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురానుంది. పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ అవ్వడంతో వాహనదారులకు విధించే జరిమానాలలో చాలా వరకు మార్పులు రానున్నాయి.

తద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదంతో కొత్త చట్టంగా మారే అవకాశం ఉంది. 1988లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ఈ ఏడాది సవరణ చేసింది. రోడ్డు ప్రమాదాలను నియత్రించేందుకు ఈ సవరణలు చేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం.

జరిమానాలను పెంచడం ద్వారా అయినా వాహనాలను డ్రైవ్ చేసే వారి అలవాట్లలో మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది వరకు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడం లేదా సిగ్నల్ లైట్ జంపింగ్ చేసిన ఓ మోస్తారు జరిమానాలను విధించేవారు ట్రాఫిక్ పోలీసులు.

కానీ ఎక్కువగా వీటి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇకపై మాత్రం రూల్ప్ అతిక్రమించే వారికి వేల రూపాయల్లో ఫైన్ విధించనున్నారు. మైనర్ బాలలు వాహనం నడిపి ఏదైనా ప్రమాదానికి గురిచేస్తే ఆ వాహన యజమానులదే పూర్తి బాధ్యత వహించాల్పి ఉంటుంది.

సాధారణంగా వారి వద్ద ఎలాంటి అనుమతులు ఉండవు, దానికి తోడు ఓవర్ స్పీడ్ తో ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి డ్రైవ్ చేస్తున్నారు మైనర్లు. అయితే ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినపుడు తమకు తెలియకుండా నేరం జరిగిందని నిరూపిస్తే రూల్స్ అతిక్రమించినందుకు గాను మైనర్లదే తప్పుగా పరిగణిస్తారు.

దాంతో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ ను ఏడాది పాటు రద్దు చేయడమే కాకుండా జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారణ జరుగుతుంది.
ఇది వరకు రాష్‌ డ్రైవింగ్ చేస్తే రూ. 1000 ఉండేది కానీ కొత్త చట్టం అమలైతే రూ.5000 వరకు జరిమానా విధించనున్నారు. అంతే కాకుండా తాగి వాహనం నడుపుతు పట్టుబడితే రూ. 2000 ఫైన్ విధించేవారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే రూ.10,000 వరకు పెంచారు.

అదేవిధంగా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఇదివరకు రూ. 500 నుంచి రూ.5000 వరకు పెంచారు. ఓవర్ స్పీడ్ తో వాహనాన్ని డ్రైవ్ చేస్తే రూ. 400 నుంచి రూ.1,500, 2,000 వరకు జరిమానా వడ్డిస్తారు.

వీటితో పాటు ఫోర్ వీలర్స్ ను డ్రైవ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్ ఇది వరకు రూ. 100 ఉండేది. కానీ ఇకపై రూ. 1000 కు పెంచారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే 1000 ఉన్న జరిమానా రూ. 5000 కు పెరిగింది.

బైక్ నడుపుతు హెల్మెట్ పెట్లుకోకుండా వెళ్లే వాళ్లకు ప్రస్తుతం రూ. 100 జరిమానా విధిస్తుండగా ఇకమీదట 1000 విధించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవ్ చేసే వారు ట్రాఫిక్ రూల్ప్ పాటించకపోవడమే.

అయితే వీటికి సంబంధించిన కొన్ని నేరాలకు జరిమానాలను పెంచాలనుకుంది. తద్వారా  వీటిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ రూల్ప్ ను అతిక్రమించకుండా డ్రైవ్ చేయాలని కొత్త వెహికల్ చట్టం ముఖ్య ఉద్దేశం.