పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి పాత నేతలను తీసుకుంటున్న విధానం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీల నుండి జంపింగ్ లను ప్రోత్సహించని పవన్ కళ్యాన్ మాజీలు, ఇప్పుడు రాజకీయాల్లో లేని నేతలను ఏరికోరి పార్టీలోకి తీసుకోవడం కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది. జనసేన ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ , తన కుమారులు జనసేన పార్టీలో చేరినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. మీడియా రంగంలో అపార అనుభవం కలిగిన ఈ కుటుంబం చేరిక జనసేన పార్టీకి కలిసివస్తుందనే భావనలో జనసేన ఉన్నట్టు అర్ధం అవుతోంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముత్తా గోపాలకృష్ణ 1983-89, 1994-99, 2004 లో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రిగా కూడా పనిచేశారు.
పలు బిజినెస్ లతో పాటు ఈయన ఆధ్వర్యంలో ఉన్న వాసవి కమ్యూనికేషన్స్ మీడియా రంగంలో బలమైన ముద్ర వేసింది. ఆంధ్రప్రభ పత్రికను ఈయన సొంతం చేసుకోవడమే కాకుండా, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక లో వాటా కూడా కలిగి ఉండటం ఇప్పుడు పవన్ కి మరింత కలిసి వచ్చే అంశాలు అని చెప్పొచ్చు. అపార రాజకీయ అనుభవం కలిగిన ముత్తా గోపాలకృష్ణ ను పార్టీలోకి రావాల్సిందిగా స్వయంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడని, దానికి ఆయన సమ్మతించారని జనసేన పార్టీ విడుదల చేసింది. ఆయనతో పాటు ఇంగ్లీష్ మీడియా చానల్ ఒకటి పారంభిస్తున్న ఆయన కుమారుడిని కూడా పార్టీలోకి చేర్చుకుని జాతీయ స్థాయిలో కూడా పవన్ ద్రుష్టి సారిస్తున్నారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ మీడియా మేనేజ్మెంట్ మీద ఎంత ద్రుష్టి పెడుతున్నారో అర్ధం అవుతోంది.