ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పై కొనసాగుతున్న చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పై కొనసాగుతున్న చర్చ

ఐదు నెలల కిందటి వరకూ.. అమరావతి రాజధాని విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. అటు ఉత్తరాంధ్ర నుంచి.. ఇటు రాయలసీమ నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉంటుంది. రాష్ట్రం మధ్యలో ఉంటుంది. రవాణా సౌకర్యాలు.. అంత కన్నా.. గొప్పగా ఉన్న ప్రాంతం మరొకటి లేదు. అందుకే.. రాజధానిలో పనుల కోసం వచ్చే వారికి కూడా సులువుగా ఉంటుందని.. దానికి సర్వామోదం లభించింది. కానీ అది వైసీపీకి మాత్రమే నచ్చలేదు.

అధికారం చేపట్టినప్పటి నుండి. మార్చాలనే వ్యూహాన్నే అమలు చేస్తోంది. వరద వస్తే మునుగుతుందని… దుబారా అని.. అవినీతి అని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. రకరకాలుగా అమరావతిపై ప్రచారాలు చెప్పారు. అవన్నీ… ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు.. జీఎన్ రావు అనే నిపుణుడిని తెరపైకి తెచ్చి… రాజధానిని తాము ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో.. అక్కడే పెట్టాలనే నివేదిక ఇప్పించుకునేందుకు రెడీ అయ్యారు. అమరావతిపై ఇప్పుడు అభిప్రాయసేకరణ అవసరం ఏమిటి…గత ప్రభుత్వం అమరావతిని … ప్రకటించినప్పుడు.. ప్రస్తుత సీఎం.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో …సమర్థించారు. ఇసుమంత కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలే్దు. 30వేల ఎకరాలు ఉండేలా చూసుకోవాలని ఉచిత సలహా కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఆయన సలహాను పాటించి 35వేల ఎకరాలను సమీకరించింది.

రాజధానిపై వైసీపీ అభ్యంతరం అంతా.. అవినీతిపైనే. రాజధానిపైన కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలే పలుమార్లు ప్రకటించారు. అధికారం చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ అవినీతిని బయట పెట్టి.. అమరావతిని అభివృద్ధి చేయాలి కానీ.. అటు అవినీతిని బయట పెట్టుకుండా.. ఇటు రాజధానిపై గందరగోళం ఏర్పరిచేందుకు కమిటీల పేరుతో.. గందరగోళం సృష్టించడం పాలకుల వ్యూహానికి నిదర్శనం. “రూ. 30వేల కోట్ల దుబారా” టైప్ నివేదికే కదా బయటకు వచ్చేది.పనులు జరిగింది రూ. ఐదు వేల కోట్లు కానీ రూ. 30వేల కోట్ల దుబారా జరిగిందని… జీఎన్ రావు కమిటీకి ముందే..

రాజధానిపై ఏర్పాటైన రేమండ్ పీటర్ అనే మరో పెద్ద నిపుణుడి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను గొప్పగా మీడియాకు లీక్ చేశారు. కానీ.. అది వైసీపీ మార్క్ అని అందరికీ తెలిసిపోయింది. బొత్స నాలిక్కరుచుకున్నా.. ప్రయోజనం లేకపోయింది. ఈ రేమండ్ పీటర్… జీఎన్ రావు నిపుణుల కమిటీలో కీలక మెంబర్. సీఎం వైఎస్ జగన్ మేనత్త కుమారుడు., ఆయనే .. మొత్తం చక్క బెడుతూంటారు. అంటే.. ప్రభుత్వం ఏం కోరుకుంటుందో.. అదే నివేదిక రూపంలో వస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకూ అమరావతి కేంద్రంగా జరిపిన ప్రచారా‌న్ని చూస్తే… ప్రభుత్వ అడుగులు పరిశీలిస్తే.. మళ్లీ కొత్త రాజధాని ఖాయమని సులువుగానే ఊహించవచ్చు…