రేపు శ్రీకాకుళం వెళ్లనున్న జగన్

రేపు శ్రీకాకుళం వెళ్లనున్న జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖారారైంది.  రేపు జిల్లాలో పర్యటించనున్న జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి.. విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్తారు. ఉదయం 11 గంటలకు కాశీబుగ్గ చేరుకుని.. అక్కడి రైల్వే గ్రౌండ్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు ఏపీ సీఎం. ఉద్దానం ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు, పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారాయన. అనంతరం పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని  ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు జగన్‌.v