చంద్రబాబు భద్రత విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ కీలక నిర్ణయం

చంద్రబాబు భద్రత విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ కీలక నిర్ణయం

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ ని ప్రతిపక్షనేత చంద్రబాబు కల్పిస్తున్నట్లు తెలియజేసారు. అయితే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రదేశ్ లో దుమారం లేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కు భద్రత తగ్గించారు అంటూ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే ఆ వ్యాఖ్యల ఫై స్పందించిన ఏపీ డీజీపీ కార్యాలయం స్పందించింది.

చంద్రబాబు కు భద్రత విషయం లో ఎలాంటి మార్పులు చేయలేదని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం జెట్ ప్లస్ కేటగిరిలో సెక్యూరిటీ లో చంద్రబాబు కి భద్రత కల్పిస్తున్నట్లు తెలియజేసింది. అయితే సెక్యూరిటీ రివ్యూ కమిటీ చేసిన సూచన మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలియజేసింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు కి మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. విజయవాడలో 135 మంది తో మరియు హైదరాబాద్ లో 48 మందితో భద్రత చేపట్టినట్లు తెలియజేసింది.