ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

యాదాద్రి జిల్లాలో ఒక దారుణమైన విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు ప్రేమికులు, తమ ప్రేమకు వారి పెద్దలు అంగీకరించని కారణంతో గత రెండు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన రెండు రోజులకే వారిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకొని మరణించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం, జంగారెడ్డి పల్లిలో ఈ దారుణమైన ఘటన జరిగింది. కాగా గ్రామానికి చెందిన అలకుంట స్వామి, ఉమా రాణి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కాగా వారిరువురు కూడా దగ్గరి బంధువులే అయినప్పటికీ కూడా వారి కుటుంబాలు ప్రేమను అంగీకరించలేదు.

అయితే ఆ ప్రేమికులిద్దరు కూడా ఇంటి నుండి వెళ్ళిపోయి ఫిబ్రవరి 16 న యాదాద్రి క్షేత్రంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుకున్నారు. ఈ విషయాన్నీ పోలీసులు వారి కుటుంబ సబ్యులకు చెప్పారు. కాగా వారు ఒప్పుకోరని ఆందోళన చెందిన ఆ జంట మంగళవారం భువనగిరి పట్టణంలో ఓ హోటల్ గదిని అద్దెకు తీసుకొని, ఆత్మహత్యకి పాల్పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న హోటల్ సిబ్బంది వచ్చేసరికి స్వామి చనిపోగా, ఉమారాణి ఇంకా కొన ఊపిరితో ఉంది. అయితే ఉమారాణిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.