జనవరి 1 వేడుకలకి ఆంధ్రాలో ఫుల్ స్టాప్… ఎందుకంటే ?

AP Government bans New Year celebration in Temples

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనవరి 1 న, కొత్త సంవత్సరం తొలిరోజున గుడికి వెళ్లి దేవుడు దర్శనం చేసుకుని స్పెషల్ పూజలు అవీ ప్లాన్ చేసుకుంటున్నారా ? . అయితే మీరు ఆంధ్రాలో వుండే వాళ్ళు అయితే మీ కోరికలో సగమే తీరుతుంది. ఈసారి జనవరి 1 నాడు యధావిధిగా దేవుడు దర్శనం దొరుకుతుంది తప్ప ప్రత్యేక పూజలు చేయరు. ఆలయాలని పండగలు, ఇతర ముఖ్య ఉత్సవాల సందర్భంగా అలంకరించినట్టు అలంకరించరు. ఇది నిజంగా నిజం. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులకి స్పష్టంగా ఆదేశాలు అందాయి.

Happy-Newyear-2018

ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక దేవాదాయ శాఖకి అనుబంధంగా పని చేస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చొరవ కనిపిస్తోంది. ఆంగ్లేయులు అలవాటు చేసిన జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం వైదిక విధానం కాదని హిందూ ధర్మ పరిరక్షణ అభిప్రాయపడింది. ట్రస్ట్ సూచనకు తగినట్టు జనవరి 1 న ఆలయాలకి ప్రత్యేక అలంకారం వంటివి ఏమీ వుండవు. ఇందుకోసం దేవాదాయ శాఖ తరపున అదనపు ఖర్చు ఏమీ చేయరు.

ap temples with devotees

ఓ వైపు టీటీడీ జనవరి 1 న తిరుమల వచ్చే భక్తులు, ప్రముఖుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా దేవాదాయ శాఖ ఈ ఆదేశాలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జనవరి 1 న కాకుండా ఉగాది రోజు కొత్త ఏడాది సంబరాలు జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మీద కొన్ని డౌట్స్ లేకపోలేదు. బీజేపీ కి చెందిన మంత్రి మాణిక్యాలరావు ఆ శాఖ నిర్వహిస్తున్నందునే ఇలాంటి నిర్ణయాలు వస్తున్నాయని అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి. దేశమంతా మతవిశ్వాసాలు పెంచి వాటి ద్వారా లబ్ది పొందాలని బీజేపీ చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏ చిన్న సందర్భం వచ్చినా ప్రభుత్వం తరపున కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించడానికి ఆసక్తి చూపే సీఎం చంద్రబాబు ఇప్పుడు దేవాదాయ శాఖ కి అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆదేశాల మీద ఎలా స్పందిస్తారో చూడాలి.