ఆంధ్రాలో ఓటరు తీర్పు ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ ప్రతి సందర్భంలో కూడా దక్షిణ కోస్తాలో మాత్రం హోరాహోరీ పోరు సాగుతుంది. ఇది చాలా సార్లు నిరూపితం అయ్యింది. ఇప్పుడు కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. నిజానికి దక్షిణ కోస్తాలో కుల ప్రభావిత రాజకీయాలు ఎక్కువ అని ఓ నమ్మకం. అందులో నిజం లేదని కాస్త చరిత్రని తిరగేస్తే అర్ధం అవుతుంది. కమ్మ డామినేషన్ ఎక్కువ ఉందనుకున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విజయవాడ , గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కన్నా కాంగ్రెస్ గెలిచిన సందర్భాలే ఎక్కువ. ఇక కృష్ణా , గుంటూరు జిల్లాల్లో ఏ గాలి వీస్తే అదే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూసాం. ప్రకాశం , నెల్లూరు జిల్లాల విషయంలోనూ ఇదే ఒరవడి. అయితే 2014 ఎన్నికల్లో ప్రకాశం , నెల్లూరు లో వైసీపీ కి ఎక్కువ స్థానాలు వచ్చి ఆ సెంటిమెంట్ ని దెబ్బ తీశాయి. ఇక ఈ రసవత్తర పోరులో జనసేన కూడా నిలవడం తో ఈసారి దక్షిణ కోస్తా తీర్పు మీద ఎంతో ఆసక్తి.
దక్షిణ కోస్తాలో ఈసారి కుల ప్రభావంతో సమంగా రాజధాని అమరావతి నిర్మాణం , ప్రభుత్వ పధకాలు కూడా నిలిచాయి. ఎన్నడూ లేని విధంగా కుల ప్రభావం ఒక్కటే సరిపోదని ఈసారి నిరూపితం అయ్యే ఛాన్స్ వుంది. రాజకీయ చురుకుదనం ఎక్కువగా వున్న ఇంటి యాజమాని మాట కన్నా మహిళలు , యువత అభిప్రాయం చెల్లిన సందర్భాలు ఈసారి దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కనిపించింది. ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా రాజధాని అమరావతి సహా వివిధ అంశాల్లో ఎదురు అయ్యే సమస్యలు ఏంటో వోటరుకి బాగా అర్ధం అయ్యింది. ఈసారి దక్షిణ కోస్తాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో పాత ప్రత్యర్థులే తలపడ్డారు. కానీ ఓటరు ఆలోచనా విధానంలో మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కుల కుంపటి మీద అభివృద్ధి అస్త్రం బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. ఆ ఫలితం ఎలా వుందో చూద్దాం.
కృష్ణా జిల్లాలో మొత్తం స్థానాలు ——-16 .
టీడీపీ గన్ షాట్ గా గెలిచేవి———8
( నూజివీడు , గన్నవరం, కైకలూరు, మచిలీపట్టణం, పెనమలూరు , విజయవాడ సెంట్రల్ , విజయవాడ ఈస్ట్ , మైలవరం )
వైసీపీ గన్ షాట్ గా గెలిచేవి ——-4 ( అవనిగడ్డ , పామర్రు , నందిగామ , జగ్గయ్యపేట )
పోటాపోటీ స్థానాలు —————-4 ( గుడివాడ , పెడన, విజయవాడ వెస్ట్ , తిరువూరు )
ఈ 4 స్థానాల్లో పోటీ నువ్వానేనా అన్నట్టు సాగింది. …అయితే గుడివాడ ,పెడన లో 2 నుంచి మూడు వేల మెజారిటీతో టీడీపీ , విజయవాడ వెస్ట్ , తిరువూరులో వైసీపీ స్వల్ప ఆధిక్యంతో గెలుస్తున్నాయి.
దీంతో కృష్ణా జిల్లా ఫైనల్ ఫలితం ఇలా ఉంటుంది.
టీడీపీ ———-10
వైసీపీ ———6 .
జనసేన —— 0 .
ఇక గుంటూరు జిల్లా లో మొత్తం స్థానాలు ———-17
టీడీపీ గన్ షాట్ గెలిచేవి —————————-10 ( పెదకూరపాడు ,తాడికొండ , మంగళగిరి , పొన్నూరు , వేమూరు , ప్రత్తిపాడు , గుంటూరు వెస్ట్ , చిలకలూరిపేట , వినుకొండ , గురజాల ) .
వైసీపీ గన్ షాట్ గా గెలిచేవి ———————— 3 ( బాపట్ల , నరసరావుపేట , మాచెర్ల )
పోటాపోటీ స్థానాలు ———————————4 ( రేపల్లె , తెనాలి , గుంటూరు ఈస్ట్ , సత్తెనపల్లి ) .
పై 4 స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. తెనాలి , సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థులు , రేపల్లె , గుంటూరు ఈస్ట్ లో వైసీపీ కాండిడేట్స్ అతి తక్కువ మెజారిటీతో బయటపడొచ్చు.
దీంతో గుంటూరు జిల్లాలో ఫైనల్ ఫలితం ఇలా
టీడీపీ ———12
వైసీపీ ———-5 .
ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం స్థానాలు ————12 .
టీడీపీ గన్ షాట్ గెలిచేవి ————————5 ( అద్దంకి, ఒంగోలు , సంతనూతలపాడు, కొండెపి , కనిగిరి ) .
వైసీపీ గన్ షాట్ గెలిచేవి ———————4 ( యర్రగొండపాలెం , దర్శి, మార్కాపురం , గిద్దలూరు ) .
పోటాపోటీ స్థానాలు ———————-3 ( పర్చూరు , చీరాల , కందుకూరు )
పర్చూరు లో దగ్గుబాటి రాకతో , చీరాల లో బలరాం రాకతో ఏకపక్షం అనుకున్న ఫలితం పోటాపోటీ అయ్యింది. అయితే 3 నుంచి 5 వేల మెజారిటీ తో ఈ రెండు స్థానాలు టీడీపీ వశం కాబోతున్నాయి . ఇక కందుకూరు మాత్రం వైసీపీ గెలవబోతోంది.
ప్రకాశం జిల్లా ఫైనల్ ఫలితం ఇలా —-
టీడీపీ ———7
వైసీపీ ———5 .
ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం స్థానాలు ———10 .
టీడీపీ గన్ షాట్ గెలిచేవి ———————3 ( కావలి, సర్వేపల్లి , గూడూరు )
వైసీపీ గన్ షాట్ గెలిచేవి ———————-6 ( ఆత్మకూరు , కోవూరు , నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట , వెంకటగిరి, ఉదయగిరి )
పోటాపోటీ స్థానాలు ————-1 .( నెల్లూరు సిటీ )
ఈ స్థానంలో మంత్రి నారాయణకు , సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. నారాయణ గాకుండా ఇంకొకరు అయితే ఈ స్థానం కూడా వైసీపీ కి దక్కేది. అయితే ఓ వ్యూహం ప్రకారం దీర్ఘకాలికంగా నారాయణ చేస్తున్న అభివృద్ధి పనులతో ఇక్కడ ఆయన 5 వేల లోపు మెజారిటీ తో గట్టెక్కవచ్చు.
నెల్లూరు ఫైనల్ ఫలితం ఇలా …
టీడీపీ ———-4 .
వైసీపీ ———6 .
మొత్తంగా దక్షిణ కోస్తాలో 55 స్థానాలకు గాను తుది ఫలితాలు ఇలా ఉంటాయి ..
టీడీపీ ———33 .
వైసీపీ ———22 .
రేపు రాయలసీమ గురించి విశ్లేషణ ఉంటుంది.