Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజతో ‘రాజా ది గ్రేట్’ చిత్రాన్ని చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి భారీ వసూళ్లను సాధించిన దర్శకుడు అనీల్‌రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్2’ అనే మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఒక హీరోగా బాలకృష్ణ నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘ఎఫ్2’ చిత్రంలో బాలయ్య అంటూ జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు అనీల్ రావిపూడి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాజాగా దర్శకుడు అనీల్‌రావిపూడి మీడియాతో మాట్లాడుతూ ఎఫ్2లో బాలయ్య వార్తలను కొట్టి పారేశాడు.
‘ఎఫ్ 2’ చిత్రంలో ఇంకా హీరోలు ఫైనల్ కాలేదు అని, వెంకటేష్‌కు కథ చెప్పగా ఆయన బాగుందన్నారు. కాని నటించే విషయమై ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఆయన ఓకే అయితే మరో హీరో పాత్రకు ఒక యువ హీరోను సంప్రదించే యోచనలో ఉన్నాము అని దర్శకుడు అనీల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసి, ఆ తర్వాత సినిమాకు సంబంధించిన హీరోల ఎంపిక విషయంపై తుది నిర్ణయాన్ని దిల్‌రాజుతో కలిసి తీసుకుంటాను అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. దీంతో బాలయ్య ‘ఎఫ్ 2’లో నటించడం లేదు అని క్లారిటీ వచ్చేసింది. బాలయ్య ప్రస్తుతం జైసింహా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసే అవకాశం ఉంది.