టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని వందల తెలుగుసినిమాల్లో ఎంతో మంది అగ్ర హీరోలకి తల్లిగా నటించిన ఆమె కూతురు కీర్తి ఈరోజు వారి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారింటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ళక్రితం కీర్తి బెంగళూరుకు చెందిన ఒక యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది.
అయితే ఆమె అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెబుతోంటే భర్త తో విభేదాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వినిపిస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం
నిర్వహిస్తున్నారు. ఆ రిపోర్ట్ వచ్చాక గానీ ఈవిషయం మీద పూర్తి అవహగానాకు రాలేమని పోలీసులుచెబుతున్నారు.