సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్, క్యూట్ మాటలు, తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఏ మాయ చేసావే” సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇక విడాకుల అనంతరం సమంత మయోసైటిస్ వ్యాధిబారిన పడింది. ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స తీసుకుంటుంది. ఇక ఈ వ్యాధితోనే పోరాడుతున్న సమంత మధు మరో వ్యాధి బారిన పడిందట. ఈ వ్యాధి పెద్దగా తీవ్రమైనది కానప్పటికీ తనకి కోపం వచ్చినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయట.
తనకి విపరీతంగా కోపం వచ్చినప్పుడు తన చేతిలో ఏది ఉన్న దాన్ని విసిరేయడం, తన ఎదురుగా ఎవరు ఉన్నా వారిని పెద్దగా పట్టించుకోవడం వంటివి జరుగుతున్నాయట. ఇక ఈ వ్యాధికి కూడా సమంత ట్రీట్మెంట్ తీసుకుంటుందని సమాచారం అందుతుంది. ఇక సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పటికీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. తాజాగా సమంత నటించిన ఖుషి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.