“బాలయ్య 109 సినిమాలో మరో కొత్త హీరోయిన్?”

"Another new heroine in Balayya 109?"
"Another new heroine in Balayya 109?"

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ కోసం మన అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ మూవీ గా (NBK 109) ప్లాన్ చేస్తుండగా ఈ మూవీ కోసం అభిమానులు ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాలిడ్ మాస్ మూమెంట్స్ తో ఫుల్ స్వింగ్ లో మూవీ షూటింగ్ ఇపుడు జరిగిపోతుంది. అయితే ఈ మూవీ లో బాలయ్య సరసన ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

"Another new heroine in Balayya 109?"
“Another new heroine in Balayya 109?”

అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు కానీ ప్రగ్యా అయితే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక లేటెస్ట్ గా ఈమె కాకుండా మరో యంగ్ హీరోయిన్ కూడా ఉన్నది అన్నట్టుగా రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. దీనితో ఆ రెండో హీరోయిన్ గా జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది . మరి దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.