మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ల్లో తన కెరీర్ లో 12వ సినిమా కూడా ఒకటి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ఈ సినిమా లో విజయ్ రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుండగా ఈ మూవీ పై లేటెస్ట్ గా నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ అందించారు.
ప్రెజెంట్ కొనసాగుతున్న ట్రెండ్ లోనే ఈ మూవీ కి కూడా సాలిడ్ సీక్వెల్ ఉన్నట్టుగా ఇపుడు తెలిపారు. ఆల్రెడీ ఈ మూవీ పై మంచి బజ్ ఉంది. ఇక అది కూడా గౌతమ్ లాంటి దర్శకుని నుంచి సీక్వెల్ అంటే మినిమమ్ అంచనాలు పెట్టుకోవచ్చు. మరి ఈ మూవీ టీజర్, గ్లింప్స్ లాంటివి త్వరలోనే రానున్నాయి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 28న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.